ప్రతి చిన్న పనికి AI టూల్స్ ఉపయోగించే అలవాటు పెరుగుతోంది. కానీ, ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొంతమంది విద్యార్థులను 3 విభాగాలుగా చేసి.. వారిని ChatGPT, Google Gemini సాయంతోపాటు సొంతంగా ఎస్సే రాయమన్నారు. Alని ఉపయోగించిన వారి ఆలోచనల్లో చురుకుదనం లేదని గుర్తించారు. AIపై ఆధారపడితే జ్ఞాపకశక్తి తగ్గుతుందని చెబుతున్నారు.