W.G. తణుకులో వంగవీటి మోహన రంగా వర్ధంతిని ఇవాళ నిర్వహించారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్లోని రంగా విగ్రహానికి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా చేసిన కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.