KMM: ప్లాస్టిక్ నిషేదాన్ని కఠినంగా అమలు చేసే కార్యక్రమంలో భాగంగా కేఎంసీ అధికారులు శుక్రవారం ఖమ్మం గాంధీ చౌక్ ప్రాంతంలో దుకాణదారులకు, చిరువ్యాపారులకు బయో డిగ్రడేబుల్ కవర్లను అందజేశారు. ఒక్కో దుకాణానికి కేజీ కవర్లను ఉచితంగా అందించారు. ఏఎంసీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, బయో డిగ్రడేబుల్ కవర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.