PDPL: ఓదెల మండలం కొలనూరు రైల్వే గేటు వద్ద మూడు లైన్లు ఉండటంతో నిత్యం భారీ ట్రాఫిక్ ఏర్పడుతోంది. గేటు ఒకసారి మూసివేస్తే అరగంటకు పైగా తీయలేని పరిస్థితి నెలకొనడంతో అత్యవసర చికిత్సకు వెళ్లే రోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు చొరవ తీసుకొని ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నారు.