నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్పై దాడి చేసిన జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం దేవరకొండలో మాట్లాడుతూ.. జిల్లాలో బీసీ నాయకత్వాన్ని ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని అన్నారు.