E.G: నిడదవోలు YCP కార్యాలయం వద్ద వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ వైసీపీ అధ్యక్షులు కామిశెట్టి సత్తిబాబు వంగవీటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి అన్నారు.