GNTR: తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం తమ విధులను బహిష్కరించారు. కొత్తపేటలోని కోర్టు ఎదుట నిరసన తెలియజేశారు. పత్తికొండ కోర్టు హాల్ నుంచి న్యాయమూర్తి, న్యాయవాదులు చూస్తుండగానే నిందితుడిని బలవంతంగా, క్రిమినల్ ప్రొసీజర్కి వ్యతిరేకంగా అరెస్టు చేసిన పోలీసుల చర్యలకు నిరసనగా విధులు బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ న్యాయవాదులు తెలిపారు.