AKP: పాయకరావుపేట జీవీఆర్ నగర్లో శుక్రవారం వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని నిర్వహించారు. కాపునాడు అధ్యక్షుడు జగతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి రంగా కృషి చేశారని గ్రంథాలయ మాజీ ఛైర్మన్ తోట నగేష్ అన్నారు.