NZB: కమ్మర్ పల్లి మండలం హస కొత్తూర్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని పశు వైద్యాధికారి వసంత కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ రేవతి గంగాధర్, ఉప సర్పంచ్ కుందేటి శీను ప్రారంభించారు. గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మూడు నెలలకొకసారి తప్పనిసరిగా నట్టల మందు వేయించాలని సూచించారు.