GNTR: తెనాలి పట్టణం వైకుంఠపురం సమీపంలో పడమర కాలువలో కొట్టుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని త్రీ టౌన్ పోలీసులు వెలికితీశారు. మృతదేహాన్ని శుక్రవారం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని ఆచూకీ తెలియలేదని సీఐ సాంబశివరావు చెప్పారు. నలుపు రంగు చెక్ షర్ట్ ధరించిన మృతుని వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.