KDP: దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. అర్చకులు మయూరం కృష్ణస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 1.30 గంటల నుంచే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 11.30 వరకు వైకుంఠ వాహనంపై స్వామి భక్తులకు దర్శనమిస్తారు, అనంతరం గ్రామోత్సవం ఉంటుందన్నారు.