స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘వృషభ’ మూవీ DEC 25న మలయాళం, తెలుగులో విడుదలైంది. దాదాపు రూ.70 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే కేవలం రూ.70 లక్షల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది మోహన్ లాల్ కెరీర్లోనే అత్యల్ప ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కించాడు.