ప్రకాశం: కనిగిరి మండలంలోని శ్రీరంగాపురం వద్ద ఉన్న సోషల్ ఫారెస్ట్ పార్క్లో నూతన సంవత్సర వేడుకలను జరిపేందుకు టీడీపీ నాయకులు సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పార్కులో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే నాయకులకు సరైన వసతులు కల్పించాలని ఎమ్మెల్యే తెలిపారు.