W.G: ఆకివీడులోని మాదివాడ సెంటర్లో వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. నిమ్మల నాగు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రంగా నిలిచారని వక్తలు కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.