ATP: బీజేపీ రాష్ట్ర నాయకులు లలిత్ కుమార్ తల్లి యశోద మృతి చెందడంతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆమె పార్థీవ దేహానికి నివాళులర్పించారు. శుక్రవారం నగరంలోని వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం లలిత్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.