KMR: నసురుల్లాబాద్ మండలం దుర్కి మాజీ సర్పంచ్ ఉడతల నారా గౌడ్ దుర్గామాత దేవాలయ నిర్మాణానికి తన సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. శుక్రవారం భూమికి సంబంధించిన దస్తావేజులను గ్రామస్తులకు అందజేశారు. నారా గౌడ్ మాట్లాడుతూ.. దేవాలయ నిర్మాణానికి భూమిని ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.