ASF: ఉట్నూర్ మండలంలోని చాందూరి నుంచి హస్నాపూర్ వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. రోడ్డుపై భారీ గుంతలు పడటంతో పాటు కంకర తేలి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నడుచుకుంటూ వెళ్లడానికి కూడా వీలులేకుండా రోడ్డు తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు