CTR: పాలసముద్రం మండలం కమ్మపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ ఓం శక్తి ఆలయ మహాకుంభాభిషేక ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో హోమాలు, పూజలు చేశారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆయన ఓం శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి నాయకుడు బి.చిట్టిబాబు నాయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు.