MLG: మేడారం జాతర చిహ్నాల పై ఓ పత్రిక వ్యాఖ్యలు సిగ్గుచేటని వ్యవసాయ మార్కెట్ ఛైర్పర్సన్ కళ్యాణి ఆరోపించారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీ కట్టుబాట్లు, చరిత్ర తెలియకుండా మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు. ఆధునికత, బ్రాహ్మణవాదం పుట్టకముందే ఆదివాసులు దేశానికి దిశ నిర్దేశం చేశారని, దొరల పత్రికలకు ఇది కూడా తెలియదని ఆమె ఎద్దేవా చేశారు.