W.G: జూద క్రీడలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేద తెలిపారు. గత మూడు నెలల్లో ఈ బృందం 26 దాడులు నిర్వహించి, 128 మందిని అదుపులోకి తీసుకుందని శుక్రవారం వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 2,59,100 నగదు, 62 సెల్ ఫోన్లు, 27 మోటార్ సైకిళ్లు, 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.