KMR: భిక్కనూర్ శివారులోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం శుక్రవారం ప్రత్యేక ఆరోగ్య సర్వే నిర్వహించారు. మండల వైద్యాధికారి దివ్య ఆదేశాల మేరకు ఏఎన్ఎం శ్యామల, ఆశా కార్యకర్తలు కార్మికుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించారు. అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి, వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు.