NLG: చిట్యాల పురపాలిక పరిధిలోని 1వ వార్డు శివనేనిగూడెం శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వార్డుకు చెందిన యువకులు రుద్రవరం మధు ఆధ్వర్యంలో ఇవాళ సంతకాల సేకరణ కొనసాగించారు. డంపింగ్ యార్డ్‌ను మరో చోటికి తరలించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ వెళ్లి సంతకాల సేకరణ చేశారు. అలాగే ఈరోజు అఖిలపక్ష సమావేశం జరగనుంది.