AP: కాపునేత వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు రాధాకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరాధించే వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు. భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. రంగా ఆశయాల సాధన కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.