SRD: హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన ఆరెగల్ల స్వామి (25) గురువారం సాయంత్రం మంజీర నదిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో శుక్రవారం గజ ఈతగాళ్ల సహాయంతో మంజీరా నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. అయితే అరె గల్ల స్వామి మంజీరా నదిలో గల్లంతవడానికి కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.