VZM: గుర్ల మండలంలోని గ్రామాలలో సంక్రాంతి సందడి మొదలైంది. తెల్లవారుజాము నుంచి గ్రామాల్లో హరిదాసులు కీర్తనలు పాడుకుంటూ ప్రతి ఇంటికి వెళ్లారు. హరిలో రంగా హరి అంటూ ప్రతి ఇంటి ముందు భజన చేశారు. మహా విష్ణువు అవతారమైన హరిదాసులు తలపై ధరించిన అక్షయపాత్రలో మహిళలు, చిన్నారులు కొత్త బియ్యం వేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు.