WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. రాజేందర్ తెలిపారు. యూజీసీ నెట్, టీజీసెట్, టీజీటెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.