బాపట్ల జిల్లా ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ నరేష్ కుమార్ శుక్రవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. తొలుత ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారి నరేష్ కుమార్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని అన్నారు.