NGKL: ఆశా కార్యకర్తలకు పెండింగ్లో ఉన్న లెప్రసీ, పోలియో, ఎలక్షన్ సర్వేల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా కార్యదర్శి కళావతి తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపడుతున్న ఈ నిరసనలో జిల్లాలోని ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.