ASR: విశాఖపట్నంలో జనవరి 4న జరగబోయే CITU బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లా కోశాధికారి పోతురాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ, గిరిజన సంఘం శ్రేణులతో అరకులోయలో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర పాల్గొన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.