WGL: వరంగల్ జిల్లాలో సకాలంలో రుణాలు చెల్లించిన స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. వడ్డీలేని రుణాల పథకం కింద 11 మండలాల్లో 7,540 సంఘాలకు రూ.6.50 కోట్లు జమ చేసింది. 2025-2028 రుణాలపై ఈ రాయితీ వర్తిస్తుంది. అత్యధికంగా సంగెం మండలానికి రూ.79.52 లక్షలు, అత్యల్పంగా నెక్కొండకు రూ.76,958 లభించాయి.