బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1006.7 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. 21రోజుల్లో ఈ అరుదైన ఫిట్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించాడు.