ATP: అనంతపురంలోని శ్రీశ్రీ నగర్ వాసుల 20 ఏళ్ల నాటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని MLA దగ్గుపాటి ప్రసాద్ భరోసా ఇచ్చారు. ‘మీ ఇంటికి–మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లవి కృతజ్ఞతలు తెలిపారు.