కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పదో తరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అమలు చేస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై మెంటార్లుగా నియమితులైన అధికారులతో ప్రణాళిక అమలుపై చర్చించారు. విద్యార్థుల ఫలితాలు మెరుగుపడేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.