JGL: మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ పంచాయితీకి లక్కం మహిపాల్ – లాస్య దంపతులు వాటర్ డిస్పెన్సర్‌ను అందజేశారు. పంచాయితీ కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు సహాయంగా ఈ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా దాతల ఉదారతను సర్పంచ్ చిట్యాల రాజారాం, ఉప సర్పంచ్ తిరుపతి యాదవ్ అభినందించారు. యాదవ సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.