WGL: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై వరంగల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్ పరిధిలో గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 62 మంది పట్టుబడ్డారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో-16, ఈస్ట్ జోన్లో 13, వెస్ట్ జోన్ 13, సెంట్రల్ జోన్లలో 20 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.