KRNL: మద్దికేర(M) కేంద్రానికి చెందిన ఉప్పర వీరప్ప, లలితల కుమార్తె శివాని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం అందుకున్నారు. జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లో నాలుగేళ్లుగా కనబరుస్తున్న ప్రతిభకు ఈ గౌరవం లభించింది. తల్లి అనారోగ్యంతో మృతి చెందినా పట్టుదలతో ముందుకు సాగిన శివానిపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.