VZM: ఈనెల 28న బొబ్బిలి కోటలో స్దానిక ఎమ్మెల్యే బేబినాయన ఆద్వర్యంలో కళా ఉత్సవాలు నిర్వహించనున్నారు. జానపద, సాంస్కృతిక కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కళా ఉత్సవానికి సినీ హాస్య నటుడు శకలక శంకర్, జానపద గాయకుడు జానకిరామ్ హాజరుకానున్నారు. ఈ ఉత్సవానికీ ప్రజలు, కళాకారులు హాజరుకావాలని నటుడు శంకర్ కోరారు.