MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసిన తర్వాత మేడారంతో పాటు పరిసర గ్రామాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్య కారకంగా మారుతున్నాయి. వనదేవతల చెంత ప్లాస్టిక్ చెత్త ఆందోళన కలిగిస్తోంది. భూమిలో ప్లాస్టిక్ కలవక సారం కోల్పోతుంది. ప్లాస్టిక్‌ను తిన్న పశువులు చనిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్లాస్టిక్ రహిత జాతరకు కార్యాచరణ రూపొందించాలని భక్తులు కోరారు.