KDP: భారత క్రీడాశాఖ, మైభారత్, మదర్ థెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు కమలాపురం సి.ఎస్.ఎస్.ఆర్. కళాశాలలో ప్రత్యేక క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. పురుషులకు వాలీబాల్, మహిళలకు కబడ్డీ పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మైభారత్ అధికారి ప్రదీప్ కుమార్ శుక్రవారం తెలిపారు. 16 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న యువతీ-యువకులు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు.