PDPL: రామగుండంలోని శ్రీరామ పాదక్షేత్రం రాముని గుండాల క్షేత్రం వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 4 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చే భక్తులు సేద తీరేందుకు వారి సౌకర్యార్థం ఈ బెంచీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు లయన్స్ క్లబ్‌కు, వెలుగు స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.