AP: రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల విధులను బహిష్కరించాలని బార్ అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. పత్తికొండ కోర్టు ప్రాంగణం నుంచి నిందితుడు శివయ్యను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తికొండ, చిప్పగిరి ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.