KNR: మానకొండూర్ పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. వీరందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక నివాసంలో భోజన వసతి కల్పించారు. తొలి రోజు ఢిల్లీలోని ఇండియా గేట్, ఎర్రకోట, అక్షరధామ్‌ను విద్యార్థులు సందర్శించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వం పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు.