VSP: ప్రజా సమస్యల పరిష్కారానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని కాంగ్రెస్ విశాఖ తూర్పు ఇంఛార్జి ప్రియాంక దండి డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెన్షన్లు, పథకాలు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.