AP: 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే ఉన్నారు. భారత్లో మాత్రమే జనాభా వృద్ధి జరిగింది. మోదీ నాయకత్వంలో భారత్లో స్థిరమైన ప్రభుత్వం ఉంది. 2038 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోంది. 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం’ అని వెల్లడించారు.