ADB: హార్ట్ ఎటాక్‌తో ఐచర్ డ్రైవర్ కుప్పకూలిన ఘటన ఇవాళ ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉట్నూర్‌కు కొబ్బరి బొండాల లోడుతో వచ్చిన డ్రైవర్ పనిచేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని తెలిపారు. వెంటనే గమనించిన స్థానికులు సీపీఆర్ చేసి హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.