BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ కొండగడప గ్రామంలో CPI 101వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ పొనగని యాదగిరి జెండా ఆవిష్కరణ చేసి, ఎర్రజెండా నిరుపేదలు, కార్మికులు, రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ నేతలు, ప్రజానాట్య మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.