NGKL: తెలకపల్లి మండలం రాకొండ కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై కలెక్టర్ బదవత్ సంతోష్ స్పందించారు. విద్యార్థినులు బోండాలు తిని అస్వస్థతకు గురయ్యారన్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం గ్యాస్ట్రిక్ సమస్య వల్లే ముగ్గురు విద్యార్థినులు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.