MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ ముస్కుల సిద్ధిరామిరెడ్డి నేడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనుల గురించి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మైనంపల్లి.. త్వరలోనే ఆ పనులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.