MDK: రామాయంపేట మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కేవల్ కిషన్ 64వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సీపీఎం కార్యవర్గ సభ్యురాలు బాలమని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు కేవల్ కిషన్ అని అన్నారు.