ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అత్యధిక క్యాచులు పట్టిన రెండో ఫీల్డర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో బాక్సింగ్ డే టెస్టులో క్రాలీ క్యాచ్ పట్టుకోవడం ద్వారా స్మిత్(211*) ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్(210)ని అధిగమించాడు. కాగా ఈ లిస్టులో ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జో రూట్(214) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.